War-2 : కౌంట్‌డౌన్ స్టార్ట్! ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ యుద్ధానికి ఇంకా 50 రోజులు మాత్రమే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ఈ సినిమా పైన దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్, ఇంటెలిజెన్స్, దేశభక్తి మిళితమైన సన్నివేశాలు ప్రధానంగా కనిపించనున్నాయి.

ఎన్టీఆర్ – పవర్‌ఫుల్ స్పై పాత్రలో..!

War2
War2

ఎన్టీఆర్ పాత్ర గురించి మేకర్స్ అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇండస్ట్రీలో విన్నపం ప్రకారం ఇది ఓ గ్రే షేడ్ ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్ర. మాస్ + క్లాస్ మిక్స్ కావడం తథ్యం! ఎన్టీఆర్ హిందీలో డబ్బింగ్ కూడా తానే చెబుతారట అనే వార్తలు కలకలం రేపుతున్నాయి.

హృతిక్ రోషన్ – ‘కబీర్’గా మరోసారి రాబోతున్నాడు

War-2
War-2

‘వార్ 1’లో తన స్టైల్, యాక్షన్‌తో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న హృతిక్ రోషన్ – ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ గెటప్ తో “కబీర్”గా తిరిగి వస్తున్నాడు. ఎన్టీఆర్‌తో తలపడే సన్నివేశాలు goosebumps ఇచ్చేలా ఉంటాయని టీమ్ చెప్పింది.

War-2
War-2

వార్-2 రివ్యూ కోసం చదవండి :

ఎన్టీఆర్‌తో తలపడే సన్నివేశాలు goosebumps ఇచ్చేలా ఉంటాయని టీమ్ చెప్పింది.‘బ్రహ్మాస్త్ర’ ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. స్పెషల్ స్టంట్స్, ఇంటర్నేషనల్ లొకేషన్స్, టెక్నికల్ టీమ్ – అంతా వరల్డ్ క్లాస్.స్వాతంత్ర దినోత్సవ వారం నాటికి విడుదల అవ్వడం, మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ కావడం – అన్నీ కలిపి ఈ సినిమాకు బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందని అంచనాలు. థియేటర్లలో యుద్ధం మొదలవబోతోంది.

1 thought on “War-2 : కౌంట్‌డౌన్ స్టార్ట్! ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ యుద్ధానికి ఇంకా 50 రోజులు మాత్రమే!”

Leave a Comment

error: Content is protected !!